తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లైవ్​: భాజపాపై ఉద్ధవ్ ఠాక్రే ఫైర్.. - maharashtra cm latest news

ఒక్కరోజు ముందు రసవత్తరంగా మహా రాజకీయాలు

By

Published : Nov 8, 2019, 4:38 PM IST

Updated : Nov 8, 2019, 8:46 PM IST

18:43 November 08

భాజపాపై విమర్శలు గుప్పించారు ఉద్ధవ్​ ఠాక్రే. గంగా నది ప్రక్షాళన చేస్తూ ఆ పార్టీ నేతల ఆలోచనలు కలుషిితమయ్యాయని ధ్వజమెత్తారు. తప్పుడు వ్యక్తులతో కూటమిగా ఏర్పడినందుకు బాధగా ఉందని వ్యాఖ్యానించారు. చర్చలకు ద్వారాలు తాము మూసివేయలేదని చెప్పారు ఠాక్రే. భాజపా నేతలు అబద్ధాలు చెప్పినందు వల్లే వారితో మాట్లాడటం లేదని తెలిపారు. ఎన్సీపీతో శివసేన సంప్రదింపులు జరపలేదన్నారు. సీఎం పదవీకాలం చెరిసగం(50:50 ఫార్ములా)పై విషయంపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

18:31 November 08

మాకు భాజపా అవసరం లేదు: ఉద్ధవ్​ ఠాక్రే

పఢణవీస్ మీడియా సమావేశం పై శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలతో చాలా బాధపడినట్లు తెలిపారు. మహారాష్ట్రలో శివసేన సీఎం పదవి చేపట్టడానికి భాజపా మద్దతు అవసరం లేదన్నారు ఠాక్రే.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని ఏదో ఒక రోజు శివసేన చేపడుతుందని తన తండ్రి బాల్ ఠాక్రేకు ఇచ్చిన మాటను నిజం చేస్తానని వ్యాఖ్యానించారు. ఇందుకు అమిత్​ షా, ఫడణవీస్​ల మద్దతు అవసరం లేదని తేల్చిచెప్పారు ఠాక్రే.

18:21 November 08

భాజపా-శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి: గడ్కరీ

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా సమయముందన్నారు భాజపా సీనియర్​ నేత, కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీ. ప్రజల సంక్షేమం కోసం భాజపా-శివసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. సీఎం పదవీకాలం చెరిసగం అంశంపై స్పందిస్తూ...అలాంటి హామీ అమిత్​ షా ఇవ్వలేదని చెప్పారు గడ్కరీ.

17:50 November 08

శివసేన అధికారంలోకి రాగలదు: సంజయ్​ రౌత్​

శివసేన తలుచుకుంటే మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని  ఆ పార్టీ నేత సంజయ్​ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు​. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి తన నేతృత్వంలోనే భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఫడణవీస్​ భావిస్తే.. ఆయనకు శుభాకాంక్షలు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు రౌత్​.

17:36 November 08

శివసేనతో ఇంకా తెగదెంపులు జరగలేదు: ఫడణవీస్​

ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు విఫలం కావడానికి 100శాతం శివసేనే కారణమన్నారు ఫడణవీస్​. తాము చేస్తే స్పందించడం లేదని, చర్చలు ముందుకు సాగనీయడం లేదని తెలిపారు. భాజపా-శివసేనక కూటమి ఇంకా విడిపోలేదన్నారు. ఈ విషయంపై ఇరు పార్టీలు అధికారిక ప్రకటన చేయలేదన్నారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో శివసేన ఇంకా భాగస్వామిగానే ఉందని గుర్తు చేశారు ఫడణవీస్

17:24 November 08

ఆలస్యానికి శివసేనే కారణం: ఫడణవీస్​

ప్రభుత్వ ఏర్పాటు సంక్షోభ పరిష్కారం కోసం తాను  చాలా ప్రయత్నించినట్లు తెలిపారు ఫడణవీస్‌. భాజపాతో చర్చలు జరిపేది లేదంటూ ఎన్‌సీపీ, కాంగ్రెస్‌తో సేన చర్చలు జరుపుతోందన్నారు. శివసేన నేతల వ్యాఖ్యలతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఇబ్బందిగా మారిందన్నారు ఫడణవీస్.

శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేను భాజపా ఎప్పుడూ అగౌరవపరచలేదని, తప్పుగా మాట్లాడలేదని చెప్పారు ఫడణవీస్‌. భాగస్వామి పార్టీ మా గురించి చెడుగా మాట్లాడటం అంగీకరించలేమని స్పష్టం చేశారు.
శివసేన నేతల మాటలు చాలా బాధ కలిగించాయని..మోదీ గురించి సేన ఇలాగే మాట్లాడితే వారితో స్నేహంపై పునరాలోచిస్తామని ఫడణవీస్ తేల్చి చెప్పారు.

17:05 November 08

'సీఎం పదవీకాలం చెరిసగంపై ఎప్పుడూ నిర్ణయం జరగలేదు'

మహారాష్ట్ర సీఎం పదవీకాలాన్ని చెరి రెండున్నరేళ్లు( 50:50 ఫార్ములా) భాజపా-శివసేన పంచుకోవాలనే విషయంపై ఎప్పుడూ నిర్ణయం తీసుకోలేదని తెలిపారు ఫడణవీస్. భాజపా అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా ఈ విషయాన్ని చెప్పారని పేర్కొన్నారు.

16:58 November 08

ఠాక్రే నుంచి స్పందన లేదు: ఫడణవీస్​

శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రేకు పలుమార్లు ఫోన్​ చేస్తే స్పందించడం లేదని తెలిపారు ఫడణవీస్.  శివసేనతో మహారాష్ట్ర సీఎం పదవీకాలం చెరిసగం పంచుకోవాలనే విషయంపై తన ఆధ్వర్యంలో ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఫడణవీస్​.

16:42 November 08

ఫడణవీస్ రాజీనామా

మహారాష్ట్ర సీఎం పదవికి దేవేంద్ర ఫడణవీస్‌ రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు రాజీనామా పత్రం సమర్పించారు. తన రాజీనామాను గవర్నర్​ ఆమోదించినట్లు తెలిపారు ఫడణవీస్​.మహారాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వ గడువు రేపటితో ముగియనుంది. సీఎం పదవి చెరిసగం షరతు నుంచి శివసేన వెనక్కి తగ్గక... నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ఉత్కంఠ నెలకొంది.

16:18 November 08

గవర్నర్​ వద్దకు ఫడణవీస్​- పవార్​ వద్దకు రౌత్​

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై మరింత ఉత్కంఠ నెలకొంది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్​.. ఆ రాష్ట్ర గవర్నర్​ను కలిశారు. మరోవైపు శివసేన నేత సంజయ్​ రౌత్​..ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​తో భేటీ అయ్యేందుకు ఆయన నివాసానిక చేరుకున్నారు.

సీఎం పదవిపై భాజపా-శివసేన వెనక్కి తగ్గకపోవడం వల్ల ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వ గడువు రేపటితో ముగియనుంది. నూతన ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా స్పష్టత లేదు.

Last Updated : Nov 8, 2019, 8:46 PM IST

ABOUT THE AUTHOR

...view details