తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లాక్​డౌన్​ ఈనెల 31 వరకు పొడిగింపు - LOCKDOWN-EXTENSION news

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్​డౌన్​ ఆంక్షలను ఈ నెల 31 వరకు పొడిగించాయి మహారాష్ట్ర, తమిళనాడు ప్రభుత్వాలు. దశల వారీగా ఆంక్షలు ఎత్తివేసే వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చెప్పాయి.

LOCKDOWN-EXTENSION
మహారాష్ట్రలో లాక్​డౌన్​ ఈనెల 31 వరకు పొడగింపు

By

Published : May 17, 2020, 2:34 PM IST

Updated : May 17, 2020, 3:28 PM IST

దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా విధించిన లాక్​డౌన్​ నేటితో ముగియనున్న నేపథ్యంలో వైరస్​ కట్టడికి ఆంక్షలను మే 31 వరకు పొడిగించింది ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే ప్రభుత్వం. ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అజయ్​ మెహతా. వివిధ ప్రాంతాల్లో దశల వారీగా ఆంక్షల సడలింపు లేదా ఎత్తివేతపై త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

మహారాష్ట్ర రాజధాని ముంబయిలోనే అత్యధిక కేసులు ఉన్నాయి. ఇటీవల నేరుగా మద్యం అమ్మకాలకు అనుమతించిన ప్రభుత్వం.. రెండు రోజుల్లోనే కేసులు గణనీయంగా పెరగటం వల్ల ఆన్​లైన్​లో​ టోకెన్లు జారీ చేస్తోంది.

మహారాష్ట్రలో కేసుల సంఖ్య 30వేలు దాటింది. 11 వందల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.

మరో రాష్ట్రం...

తమిళనాడు ఇదే బాటలో పయనించింది. లాక్​డౌన్​ను ఈనెల 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. పంజాబ్ ప్రభుత్వం గత రాత్రే ఇలాంటి ప్రకటన చేసింది.

Last Updated : May 17, 2020, 3:28 PM IST

ABOUT THE AUTHOR

...view details