'మహా' ప్రభుత్వ ఏర్పాటు కోసం భాజపాకు ఆహ్వానం - maharashtra govt formation news

19:36 November 09
మహారాష్ట్ర: ప్రభుత్వ ఏర్పాటుకు భాజపాకు గవర్నర్ ఆహ్వానం
మహారాష్ట్ర ప్రతిష్టంభనలో కీలక మలుపు చోటుచేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన భాజపాను.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ. ప్రస్తుత శాసనసభ గడవు ఈరోజుతో ముగిసింది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారో లేదో స్పష్టం చేయాలని భాజపాకు తెలిపారు గవర్నర్.
ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాలు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది భాజపా. కాషాయ పార్టీతో కూటమిగా బరిలోకి దిగిన శివసేన 56 సీట్లు గెలించింది. సీఎం పదవీకాాలాన్ని చెరి రెండున్నరేళ్లు పంచుకునే విషయంపై రెండు పార్టీల మధ్య సయోధ్య కుదరక ఇప్పటి వరకు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాలేదు.