మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అజిత్ పవార్ కరోనా బారిన పడ్డారు. సోమవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తెలిపారు. ప్రస్తుతం పవార్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపె తెలిపారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎంకు కరోనా - maharastra deputy cm tested corona
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మహారాష్ట్ర డిప్యూటీ సీఎంకు కరోనా
"నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం నా ఆరోగ్యం నిలకడగానే ఉంది. వైద్యుల సలహా మేరకు బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చేరాను. పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొన్నిరోజుల విశ్రాంతి తరువాత వస్తాను."
---అజిత్ పవార్ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం.