తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా' పీఠం​: సోనియాతో ఎన్​సీపీ అధినేత పవార్​ భేటీ​

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ఎన్​సీపీ అధినేత శరద్ పవార్ భేటీ కానున్నారు. సోమవారం ఈ సమావేశం జరగనుంది. ప్రభుత్వ ఏర్పాటులో భాజపా- శివసేనల మధ్య నెలకొన్న అనిశ్చితి కొనసాగుతున్న తరుణంలో.. వీరిద్దరి భేటీ ఆసక్తికరంగా మారింది. భాజపాను అధికారానికి దూరంగా ఉంచే క్రమంలో, శివసేనకు మద్దతిచ్చే అంశంపై వీరు చర్చించబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.

'మహా' పీఠం​: సోనియాతో ఎన్​సీపీ అధినేత పవార్​ భేటీ​

By

Published : Nov 3, 2019, 7:01 AM IST

Updated : Nov 3, 2019, 7:53 AM IST

'మహా' పీఠం​: సోనియాతో ఎన్​సీపీ అధినేత పవార్​ భేటీ​

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ ఎన్​సీపీ అధినేత శరద్‌ పవార్‌ సోమవారం దిల్లీలో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో మహారాష్ట్ర రాజకీయాలపై సోనియాతో చర్చిస్తారని ఎన్​సీపీ నేత అజిత్ పవార్ వెల్లడించారు.

ఇప్పటికే సోనియాతో ఫోన్‌లో మాట్లాడిన పవార్‌.. సోమవారం జరిగే చర్చలపై భవిష్యత్తు కార్యాచరణ ఆధారపడి ఉందన్నారు. కాంగ్రెస్‌- ఎన్​సీపీ కూటమి ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధంగా ఉందని.... అజిత్‌ పవార్‌ పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌, ఎన్సీపీ మద్దతుతో శివసేన ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో సోనియాతో శరద్‌ పవార్‌ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

వీరిద్దరి భేటీలో మహారాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ ఆర్థిక పరిస్థితి కూడా చర్చకు వచ్చే ఆస్కారముందని పార్టీ వర్గాలు తెలిపాయి. దిల్లీ పర్యటనకు బయల్దేరే ముందు శరద్ పవార్ ఆ పార్టీ శాసనసభ్యులతో పలు అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

అయితే రాష్ట్ర కాంగ్రెస్​ నేతలు మాత్రం.. పార్టీ శివసేనకు మద్దతు పలికి.. భాజపాను అధికారానికి దూరంగా ఉంచాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Nov 3, 2019, 7:53 AM IST

ABOUT THE AUTHOR

...view details