తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రభుత్వ ఏర్పాటుపై 'మహా' భాజపా కోర్ ​కమిటీ భేటీ - maharashtra bjp core committee news

నేడు మహారాష్ట్ర భాజపా కోర్​ కమిటీ సమావేశమైంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ పంపిన ఆహ్వానంపై సమావేశంలో చర్చలు జరిపారు భాజపా నేతలు. ఏ నిర్ణయం తీసుకున్నారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు.

మీడియాతో మాట్లాడుతున్న ముంగంటివార్​

By

Published : Nov 10, 2019, 5:45 PM IST

మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భాజాపాకు గవర్నర్​ ఆహ్వానం పంపిన నేపథ్యంలో ఆ పార్టీ కోర్​ కమిటీ సమావేశమైంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలో జరిగిన ఈ భేటిలో మహారాష్ట్ర భాజపా అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

భవిష్యత్ కార్యచరణపై సమావేశంలో చర్చించినట్లు భాజపా సినియర్ నేత సుధీర్ ముంగంటివార్​ వెల్లడించారు. ఈరోజు సాయంత్రం మరోమారు సమావేశమై ఏ నిర్ణయం తీసుకోవాలో సమాలోచలు చేస్తామని చెప్పారు. ఉదయం జరిగిన భేటీలో.. చర్చించిన అంశాలపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు ముంగంటివార్​.

మహారాష్ట్ర ప్రభుత్వ గడువు శనివారంతో ముగిసింది. నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు.. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపాను ఆ రాష్ట్ర గవర్నర్ భగత్​ సింగ్ కోషియారీ నిన్న ఆహ్వానించారు.​

ఇదీ చూడండి: విధులను విస్మరించి వాట్సాప్​ చాటింగ్​ చేసినందుకు...

ABOUT THE AUTHOR

...view details