మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నానా పటోలే తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను డిప్యూటీ స్పీకర్‌కు అందజేశారు. కాంగ్రెస్‌కు చెందిన పటోలే రెండు రోజుల క్రితమే దిల్లీకి వెళ్లి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. త్వరలో ఆయన రాష్ట్ర కాంగ్రెస్‌కు సారథ్యం వహించనున్నట్టు సమాచారం. పీసీసీ చీఫ్‌గా నియమితులు కానున్నందున ఆయన స్పీకర్ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. దీనిపై మిత్రపక్షాలకు కాంగ్రెస్ సమాచారం ఇచ్చింది.
మహారాష్ట్ర స్పీకర్ రాజీనామా.. కారణమిదే! - maharashtra congress
కాంగ్రెస్ నేత నానా పటోలే మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా చేశారు. ఆయన త్వరలో పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నట్టు సమాచారం.
![మహారాష్ట్ర స్పీకర్ రాజీనామా.. కారణమిదే! nana patole, congress](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10500521-thumbnail-3x2--pcc.jpg)
మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాజీనామా
గతంలో కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరిన పటేలే 2014లో భండారా-గోండియా నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2017 కమలం పార్టీకి గుడ్ బై చెప్పి 2018లో తిరిగి మళ్లీ కాంగ్రెస్‌లోకి వచ్చారు. 2019లో మహారాష్ట్రలోని శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సారథ్యంలో ఏర్పాటైన మహావికాస్ అఘాడీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్‌గా ఎన్నికయ్యారు.
ఇదీ చదవండి :ఉచిత వైద్యమే ఆ డాక్టర్ పాలసీ
Last Updated : Feb 4, 2021, 7:28 PM IST