తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా' విజృంభణ.. రికార్డు స్థాయిలో కరోనా కేసులు - కరోన వైరస్​ మహారాష్ట్ర

భారత్​ను కరోనా వైరస్​ కలవరపెడుతోంది. తాజాగా మహారాష్ట్రలో 3,752 కేసులు వెలుగుచూశాయి. 24 గంటల వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఉత్తర్​ప్రదేశ్​లోనూ రికార్డు స్థాయిలో 604 కరోనా కేసులు నమోదయ్యాయి.

Maharashtra adds 3,752 new COVID-19 cases; 100 patients die
'మహా' విజృంభణ.. రికార్డు స్థాయిలో కరోనా కేసులు

By

Published : Jun 18, 2020, 10:34 PM IST

దేశవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో గురువారం రికార్డు స్థాయిలో 3,752 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,20,504కు చేరింది. తాజాగా మరో 100 మంది మరణించగా మృతుల సంఖ్య 5,751కి చేరింది. అయితే 1,672 మంది తాజాగా ఆసుపత్రుల నుంచి డిశ్ఛార్జ్​ అయ్యారు. ఇప్పటివరకు 60,838 మంది వైరస్​ను జయించారు.

ఉత్తర్​ప్రదేశ్​లో...

ఉత్తర్​ప్రదేశ్​లో తాజాగా 604 కేసులు వెలుగుచూశాయి. ఒక్క రోజులో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. మొత్తం కేసులు 15,785కు చేరింది. 23 తాజా మరణాలతో 488 మంది ఇప్పటివరకు వైరస్​కు బలయ్యారు.

గుజరాత్​లో...

గుజరాత్​లో ఈ ఒక్కరోజే 510 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 25,660 మందికి కరోనా సోకింది. 31 మంది వైరస్​తో ప్రాణాలు కోల్పోయారు. 1,592 మంది ఇప్పటివరకు మరణించారు. అయితే 17,829 మంది మృత్యువు నుంచి బయటపడ్డారు.

బంగాల్​లో...

బంగాల్​లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. 435 కొత్త కేసులు నమోదుకాగా.. 12 మంది వైరస్​ ధాటికి బలయ్యారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12,735కు చేరింది. 518 మంది మరణించారు.

రాజస్థాన్​లో...

రాజస్థాన్​లో తాజాగా 315 కరోనా కేసులు నమోదయ్యాయి. 17 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య 13,87కు, మరణాల సంఖ్య 330కి చేరింది. మొత్తం మీద 10 వేల 742 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

పంజాబ్​లో...

పంజాబ్​లో కొత్తగా 118 కేసులు వెలుగుచూశాయి. ఇప్పటివరకు మొత్తం 3,615 మంది కరోనా బారిన పడ్డారు. గురువారం మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా... మొత్తం మరణాల సంఖ్య 83కు చేరింది.

వివిధ రాష్ట్రాలో ఇదీ పరిస్థితి...

రాష్ట్రం తాజా కేసులు మొత్తం కేసులు
మహారాష్ట్ర 3,752 1,20,504
ఉత్తర్​ప్రదేశ్​ 604 15,785
గుజరాత్​ 510 25,660
బంగాల్ 435 12,735
రాజస్థాన్ 315 10,742
కర్ణాటక 210 7,944
మధ్యప్రదేశ్​ 182 11,426
ఒడిశా 174 4,512
పంజాబ్​ 118 3,615
గోవా 49 705
మణిపూర్​ 52 606
హిమాచల్​ ప్రదేశ్​ 4 590
నాగాలాండ్​ 0 64

ABOUT THE AUTHOR

...view details