వలసకూలీల రక్తంతో రోడ్లు నెత్తురోడుతున్నాయి. ఇవాళ రెండు వేర్వేరు ఘటనల్లో ఏడుగురు వలసకూలీలు మృత్యువాతపడ్డారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
మహారాష్ట్రాలో నలుగురు మృతి..
మహారాష్ట్ర యావత్మల్ జిల్లా కొల్వన్ వద్ద ఉదయం 3.30 గంటల సమయంలో... ఓ బస్సు ఆగి ఉన్న ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో ఓ డ్రైవర్ సహా నలుగురు వలసకూలీలు మృతిచెందారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని ఆసుపత్రికి తరలించారు.
"బాధిత వలసకూలీలు సోలాపుర్ నుంచి నాగ్‌పుర్ రైల్వేస్టేషన్‌కు వెళ్తున్నారు. అక్కడి నుంచి శ్రామిక్ రైళ్లలో ఝార్ఖండ్‌లోని తమ స్వస్థలాలకు వెళ్లాలని అనుకున్నారు. అయితే డ్రైవర్ బస్సును నియంత్రించలేక ట్రక్కును ఢీకొనడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది."
- పోలీసులు