గోపాల్ దాస్‌కు కరోనా పాజిటివ్
ఈ నెల 5న అయోధ్యలో జరిగిన రామ మందిర భూమిపూజలో.. ప్రధాని నరేంద్ర మోదీతో వేదికను పంచుకున్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్‌కు కరోనా సోకింది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించగా గోపాల్ దాస్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. చికిత్స నిమిత్తం ఆయన దిల్లీ మేదాంత ఆసుపత్రిలో చేరనున్నారు.
గోపాల్ దాస్ ఆరోగ్య వివరాలను ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గోపాల్ దాస్‌కు వైద్యం పరంగా అన్ని విధాలుగా సహాయం చేయాలని ఆదేశించారు.