40 నియోజకవర్గాలున్న బిహార్లో 7 దశల్లో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. తొలి రెండు దశల్లో ఓటింగ్ జరిగే 9 స్థానాలకు మహాకూటమిలో ఇప్పటికే సీట్ల పంపకం పూర్తయింది. తాజాగా... 3 నుంచి 7వ దశ వరకు పోలింగ్ జరిగే 31 స్థానాల్లో పోటీపైనా భాగస్వామ్యపక్షాలు ఓ అంగీకారానికి వచ్చాయి.
బిహార్ మహాకూటమిలో ఎట్టకేలకు సీట్ల సర్దుబాటు - బిహార్
బిహార్లోని 40 లోక్సభ స్థానాల్లో పోటీ చేసేందుకు మహాకూటమిలో సీట్ల సర్దుబాటు పూర్తైంది. ఆర్జేడీ 19, కాంగ్రెస్ 9, ఇతర పార్టీలు 12 స్థానాల్లో బరిలోకి దిగనున్నాయి.
బిహార్ మహాకూటమిలో ఎట్టకేలకు సీట్ల సర్దుబాటు
కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య ప్రతిష్టంభనకు కారణమైన దర్భంగాలో తమ పార్టీనే పోటీ చేస్తుందని ప్రకటించారు తేజస్వి. ప్రస్తుత దర్భంగా ఎంపీ కీర్తి ఆజాద్ ఇటీవలే భాజపాను వీడి కాంగ్రెస్లో చేరారు. ఆ స్థానంలో ఆర్జేడీ సీనియర్ నేత అబ్దుల్ బారి సిద్దికి పోటీ చేయనున్నారు. పాటలీపుత్ర నుంచి లాలు ప్రసాద్ యాదవ్ పెద్ద కుమార్తె మిసా భారతి పోటీ చేయనున్నారు.
లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ మరోమారు ససరామ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Last Updated : Mar 29, 2019, 6:21 PM IST