ప్రధాని నరేంద్రమోదీతో ఏదైనా సాధ్యమేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పేర్కొన్నారు. మహారాష్ట్రలో నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించుతూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. ముంబయిలోని భాజపా రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు.
భాజపా గెలుపునకు కారణమైన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు ఫడణవీస్. రాష్ట్రంలో మరో ఐదేళ్లు బలమైన ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.