'50-50' ఫార్ములాపై శివసేన వెనక్కి తగ్గిందని వస్తున్న వార్తలను ఖండించారు ఆ పార్టీ నేత, ఎంపీ సంజయ్ రౌత్. కొన్ని వార్తాసంస్థలు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారంగా అభివర్ణించారు.
"పదవి పంచుకోవటంపై శివసేన వెనక్కితగ్గిందన్న వార్తలు అవాస్తవం. ఇది కొన్ని వర్గాలకు చెందిన మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారం మాత్రమే. ప్రజలకు అంతా తెలుసు. భాజపా, సేన మధ్య తీసుకున్న నిర్ణయాన్ని బట్టి... ప్రభుత్వ ఏర్పాటు ఉంటుంది."
-సంజయ్ రౌత్, శివసేన ఎంపీ