మహారాష్ట్రలో మరోసారి అధికారపీఠాన్ని అధీష్టించేందుకు భాజపా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీతో నాలుగు రోజుల్లో తొమ్మిది ఎన్నికల ర్యాలీలు నిర్వహించనుంది. ఈ నెల 21న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 18వ తేదీన ముంబయిలో ఓటర్లనుద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.
" ఆదివారం భందారా జిల్లాలోని జల్గావ్, సకోలీ ప్రాంతాల్లో జరగనున్న ర్యాలీల్లో ప్రధాని పాల్గొంటారు. 16వ తేదీన అకోలా, పన్వేల్, పార్తూర్ సభల్లో మోదీ ప్రసంగిస్తారు. ఆ తర్వాతి రోజున పుణె, పర్లీలో ఓటర్లనుద్దేశించి ప్రధాని మాట్లాడతారు."
- స్మృతి ఇరానీ, కేంద్రమంత్రి