తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహా పోరు: 52 మందితో కాంగ్రెస్ రెండో జాబితా

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో 52 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది కాంగ్రెస్. మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్​ చౌహాన్​ కరాడ్​ దక్షిణం నియోజకవర్గం నుంచి పోటీచేయనున్నారు.

కాంగ్రెస్ రెండో జాబితా

By

Published : Oct 2, 2019, 6:40 AM IST

Updated : Oct 2, 2019, 8:21 PM IST

కాంగ్రెస్ రెండో జాబితా

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్‌ పార్టీ విడుదల చేసింది. 52 మంది అభ్యర్థులతో హస్తం పార్టీ జాబితా రూపొందించింది.

రెండో జాబితాలో ఉన్న ప్రముఖుల్లో మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్‌కు కరాడ్ దక్షిణం నియోజకవర్గం టికెట్​ను ఖరారు చేసింది కాంగ్రెస్. ఖాళీ అయిన లోక్​సభ సీట్లలో జరగనున్న ఉపఎన్నికలో సతారా సీటు నుంచి పోటీ చేయాలన్న పార్టీ విజ్ఞప్తిని చౌహాన్‌ తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఆయనను కరాడ్‌ దక్షిణం నుంచే పోటీలో నిలిపింది కాంగ్రెస్​.

మాజీ ముఖ్యమంత్రి విలాస్‌ రావ్‌ దేశ్‌ముఖ్‌ కుమారుడు ధీరజ్ దేశ్‌ముఖ్‌కూ రెండో జాబితాలో చోటు దక్కింది. లాతూర్ గ్రామీణ నియోజకవర్గం నుంచి ధీరజ్ ఎన్నికల బరిలో నిలవనున్నారు. విలాస్‌రావ్‌ మరో కుమారుడు అమిత్‌.. లాతూర్‌ నగరం నుంచి పోటీపడనున్నారు. జాబితాలో యువరాజ్ మోహితే అనే పాత్రికేయుడికీ స్థానం దక్కింది. ఆయన ముంబయిలోని గోరేగావ్ నుంచి పోటీ పడతారు.

ఇదీ చూడండి: మహా పోరు: 125 మందితో భాజపా తొలి జాబితా

Last Updated : Oct 2, 2019, 8:21 PM IST

ABOUT THE AUTHOR

...view details