తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహా పోరు: కాంగ్రెస్​ తొలి జాబితాలో అశోక్​ చవాన్​ - maha polls

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఇతర పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్. 51మందితో తొలి జాబితా విడుదల చేసింది. ఆ రాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్​ భికార్​ నుంచి బరిలో నిలవనున్నారు.

'మహా' పోరు: 51మంది అభ్యర్థులతో కాంగ్రెస్​ తొలి జాబితా

By

Published : Sep 29, 2019, 8:25 PM IST

Updated : Oct 2, 2019, 12:28 PM IST

మహా పోరు: కాంగ్రెస్​ తొలి జాబితాలో అశోక్​ చవాన్​

వరుస ఎన్నికల ఓటములతో కుదేలైన కాంగ్రెస్‌... వచ్చే నెల 21న జరగనున్న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల కోసం ఇతర పార్టీల కంటే ముందే సిద్ధమైంది​. 51 మంది అభ్యర్ధులతో కాంగ్రెస్‌ తొలి జాబితాను ప్రకటించింది. మాజీ ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌, మాజీ కేంద్ర మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే కుమార్తె ప్రణితిలకు ఈ జాబితాలో చోటు దక్కింది.

భికార్‌ స్థానం నుంచి అశోక్‌ చవాన్‌ పోటీ చేయనుండగా, షోలాపూర్‌ సెంట్రల్‌ బరిలో నిలవనున్నారు ప్రణితి. 2014 శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన కాంగ్రెస్‌ ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని భావిస్తోంది. ఎన్సీపీతో కలిసి పోటీ చేస్తోంది.

ఇదీ చూడండి: 'యువభారత్​ రక్షణ కోసమే ఈ-సిగరెట్లపై నిషేధం'

Last Updated : Oct 2, 2019, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details