ప్రభుత్వ ఏర్పాటు, విధివిధానాలపై మహా వికాస్ అఘాడీ నేతల కీలక భేటి ముగిసింది. కాంగ్రెస్కు సభాపతి పదవి, ఎన్సీపీకి ఉపముఖ్యమంత్రి, ఉపసభాపతి పదవులు కేటాయిస్తున్నట్లు ఎన్సీపీ ముఖ్య నేత ప్రఫుల్ పటేల్ స్పష్టం చేశారు. ముంబయిలోని వైభవం సెంటర్లో నిర్వహించిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రమాణస్వీకారం..
ఈ రోజు సాయంత్రం జరుగనున్న ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే మరో ఇద్దరు నేతలు మంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపారు పటేల్. మంత్రి పదవులపై ఎలాంటి చర్చ జరగలేదన్న పటేల్.. డిసెంబర్ 3న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పారు.