చర్చలు, సంప్రదింపులు, సమావేశాలతో కొన్ని రోజులుగా తీరిక లేకుండా గడుపుతున్న కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన నేతలు నేడూ భేటీకానున్నారు. ప్రభుత్వం ఏర్పాటు సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అనంతరం మూడు పార్టీల నేతలు మీడియా ముందుకు రానున్నారు.
అనిశ్చితి...
రాష్ట్రంలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పడుతుందని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఇప్పటికే ప్రకటించారు. కానీ ఠాక్రే ఎంత కాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతారనే అంశంపై అస్పష్టత నెలకొంది. దీనితో పాటు కనీస ఉమ్మడి ప్రణాళిక, పదవుల పంపకాల సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. నేటి భేటీలో వీటిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారని రాజకీయ వర్గాల సమాచారం. గవర్నర్‌ను కలిసే అంశంపైనా నేడు స్పష్టత వచ్చే అవకాశముంది.