మాయదారి కరోనా వైరస్ లక్షలాది ప్రాణాలు బలిగొంది. కోట్లాది మందిని సోకకుండానే భయపెట్టి చంపుతోంది. పక్క మనిషి తుమ్మినా, దగ్గినా వైరస్ సోకిందనే అనుమానం వివాదాలకు దారితీస్తోంది. తాజాగా మహారాష్ట్రలో కరోనా సోకిందనే అనుమానంతో ఓ యువకుడిపై దాడి జరిగింది. ఆ దాడి సమయంలోనే అతడు ప్రాణాలు విడిచాడు.
లాక్డౌన్ వేళ కల్యాణ్ పట్టణానికి చెందిన 34 ఏళ్ల గణేశ్ గుప్తా.. నిత్యావసర సరకులు కొనేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చాడు. దారిలో పోలీసులను చూసి మరో మార్గంలో నడిచాడు. రోడ్డుపై గణేశ్ దగ్గడం గమనించిన కొందరు అతడికి కరోనా సోకిందని ఆరోపించారు. అనుమానంతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఆ ఘర్షణలో పక్కనే ఉన్న మురికి కాలువలో పడి మృతి చెందాడు గణేశ్.