తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పిడుగుపాటుకు ముగ్గురు మహిళా కూలీలు మృతి - మహారాష్ట్రలో పిడుగులు

మహారాష్ట్ర నాగ్​పుర్​ శివ గ్రామంలో విషాధ ఘటన చోటుచేసుకుంది. పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న క్రమంలో వర్షంలో తలదాచుకునేందుకు చెట్టుకిందకు చేరుకున్న ముగ్గురు మహిళా కూలీలు పిడుగు పాటుతో ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయప్డడారు.

Lightning
పిడుగుపాటుకు మహిళా కూలీలు మృతి

By

Published : Oct 12, 2020, 5:38 AM IST

మహారాష్ట్రలో పిడుగులతో కూడిన వర్షాలు భయపెడుతున్నాయి. నాగ్​పుర్​ జిల్లాలో పిడుగు పడి ముగ్గురు మహిళా కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తలించినట్లు కొంధాలి పోలీస్​ స్టేషన్​ సిబ్బంది తెలిపారు.

" జిల్లాలోని శివ గ్రామంలో కూలీకి వెళ్లిన మహిళలు ఇంటికి వెళుతున్న క్రమంలో ఆదివారం సాయంత్రం భారీ వర్షం రావటం వల్ల చెట్టుకింద తలదాచుకున్నారు. అదే సమయంలో చెట్టుపై పిడుగు పడి ముగ్గురు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హింగ్నా నగరంలోని ఆసుపత్రికి తరలించారు."

- పోలీసులు

ప్రాణాలు కోల్పోయిన వారిలో అర్చనా టటోడే(35), శరదా యుకీ(36), సంగీతా ముంగ్బతే(35)లుగా గుర్తించారు పోలీసులు. ప్రమాదవశాత్తు మరణించినట్లు కేసు నమోదు చేసుకున్నారు.

ఇదీ చూడండి: మరో వారం పాటు నైరుతి రుతుపవనాల ప్రభావం: ఐఎండీ

ABOUT THE AUTHOR

...view details