తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపా- 'రాష్ట్రపతి పాలన' వ్యాఖ్యలపై శివసేన ఫైర్​ - mungantiwar news

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని భాజపా నేత, రాష్ట్ర మంత్రి సుధీర్​ ముంగంటీవార్​ చేసిన వ్యాఖ్యలపై శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రపతి ఏమైనా మీ (భాజపా) జేబులో ఉన్నారా? అంటూ ప్రశ్నించింది. రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడేవారు ముందు ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించాలని సూచించింది.

'రాష్ట్రపతి పాలన' వ్యాఖ్యలపై శివసేన ఫైర్​

By

Published : Nov 2, 2019, 12:59 PM IST

Updated : Nov 2, 2019, 7:52 PM IST

భాజపా- 'రాష్ట్రపతి పాలన' వ్యాఖ్యలపై శివసేన ఫైర్​

మహారాష్ట్రలో భాజపా-శివసేనల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. నవంబర్​7 నాటికి ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్రపతి పాలన విధించవచ్చంటూ భాజపా నేత, రాష్ట్ర మంత్రి సుధీర్​ ముంగంటీవార్​ చేసిన వ్యాఖ్యలను సేన తిప్పికొట్టింది. ఆ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించింది. రాష్ట్రపతి ఏమైనా మీ(భాజపా) జేబులో ఉన్నారా..? అంటూ తన అధికార పత్రిక సామ్నాలో ప్రశ్నించింది.

రాష్ట్రపతి పాలన వ్యాఖ్యల నేపథ్యంలో ముంగంటీవార్​పై ఎదురుదాడికి దిగింది సేన. ఆయన వ్యాఖ్యలు అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధమని తెలిపింది.

"ముంగంటీవార్​ ప్రేరేపించిన ముప్పు నుంచి సామాన్య ప్రజలు తప్పించుకోవటానికి ఏం చేయాలి? భారత రాష్ట్రపతి.. భాజపా జేబులో ఉన్నారు అని దాని అర్థమా లేదా మహారాష్ట్ర భాజపా కార్యాలయంలో రాష్ట్రపతి ముద్ర ఉందా? భాజపా.. ప్రభుత్వం ఏర్పాటు చేయని పక్షంలో ఆ ముద్రతో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తారని వీరు వెల్లడిస్తున్నారా? సంఖ్యాబలానికి సంబంధం లేకుండా తాము మాత్రమే పాలన చేస్తామనే రీతిలో ముంగంటీవార్​ వైఖరి ఉంది. రాష్ట్రపతి పాలన గురించి మాట్లాడేవారు ముందు రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించాలి."

- శివసేన

తిప్పికొట్టిన ముంగంటీవార్​...

అయితే.. రాష్ట్రపతి పాలన వ్యాఖ్యలను శివసేన తప్పుగా ఆపాదించుకుందని పేర్కొన్నారు ముంగంటీవార్​. నిర్ణీత సమయంలోపు ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే ఏం జరుగుతుందో అని అడిగినప్పుడు.. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పాలన వస్తుందని సమాధానమిచ్చినట్లు పేర్కొన్నారు. విద్యార్థుల ప్రశ్నలకు ఉపాధ్యాయుడు సమాధానమిస్తే.. అది హెచ్చరికలా భావించాలా అని ప్రశ్నించారు.

అక్టోబర్​ 24న మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత చెరిసగం పాలన (50:50 ఫార్మలా)పై పట్టు వీడట్లేదు శివసేన. ఇరు పార్టీల మధ్య అవగాహన కుదరకపోవటం వల్ల ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభన నెలకొంది.

ఇదీ చూడండి: 'భారత్​ ప్రయోజనాల మేరకే ఆర్​సీఈపీ​లో చేరిక'

Last Updated : Nov 2, 2019, 7:52 PM IST

ABOUT THE AUTHOR

...view details