మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 25కి చేరింది. మెయిషీఫటా ప్రాంతంలో ప్రయాణికులతో కిక్కిరిసి ఉన్న ప్రభుత్వ రవాణా సంస్థ బస్సు వేగంగా వచ్చి ఆటోను ఢీకొనగా రెండు వాహనాలు పక్కన ఉన్న బావిలో పడిపోయాయి. ఈ ఘటనలో 9 మంది మహిళలు సహా 25 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది గాయపడ్డారు.
'మహా' రోడ్డు ప్రమాదంలో 25కు చేరిన మృతులు - Maha govt announces exgratia to the victims of road accident at Nashik
మహారాష్ట్రలో బస్సు-ఆటో ఢీకొని బావిలో పడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ప్రమాదంలో తాజాగా ఐదురుగు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మృతుల సంఖ్య 25కి చేరింది. మరోవైపు ప్రమాదంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం.. పదిలక్షల చొప్పున పరిహారం ప్రకటించింది
మహారాష్ట్ర రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం.. 21కి చేరిన మృతులు
10 లక్షల పరిహారం
క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ప్రమాదంపై దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన మహారాష్ట్ర ప్రభుత్వం.. పదిలక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారులను ఆదేశించారు.
Last Updated : Feb 28, 2020, 8:45 AM IST