తెలంగాణ

telangana

By

Published : Nov 27, 2019, 5:19 AM IST

ETV Bharat / bharat

ఇవాళ 'మహా' అసెంబ్లీ సమావేశం.. ఎమ్మెల్యేల ప్రమాణం

కొద్ది రోజులుగా కొనసాగిన అనిశ్చితి తొలగిపోవడంతో.. మహారాష్ట్ర శాసనసభ తొలిసారి నేడు సమావేశం కానుంది. ప్రొటెం స్పీకర్​గా ఎన్నికైన భాజపా సీనియర్​ ఎమ్మెల్యే కాళిదాస్​ కొలాంబ్కర్​... నూతన శాసనసభ్యులతో ప్రమాణం చేయించనున్నారు.

maha-governor-convenes-special-session-on-wednesday
ఇవాళ 'మహా' అసెంబ్లీ సమావేశం.. ఎమ్మెల్యేల ప్రమాణం

ఇవాళ 'మహా' అసెంబ్లీ సమావేశం.. ఎమ్మెల్యేల ప్రమాణం

ఉత్కంఠగా సాగిన రాజకీయ పరిణామాల అనంతరం.. ఇవాళ ఉదయం మహారాష్ట్ర శాసనసభ సమావేశం కానుంది. ఉదయం 8 గంటలకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీ ఆదేశించారు. అసెంబ్లీ ప్రొటెం స్పీకర్​గా నియమితులైన కాళిదాస్​ కొలంబ్కర్​... కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఉదయం 8 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది.

''నేడు శాసనసభ ప్రత్యేక సమావేశం ఏర్పాటుకు గవర్నర్​ భగత్​ సింగ్​ కోశ్యారీ ఆదేశించారు. 288 మంది శాసనసభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది.''

- ఓ అధికారి

288 స్థానాలున్న మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్​ 24న విడుదలయ్యాయి. అనంతరం.. 15 రోజుల తర్వాత కూడా రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం లేదని గవర్నర్ రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేశారు. నవంబర్​ 12న అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి పాలన.. 23 వరకు కొనసాగింది. ఫలితంగా... శాసనసభ్యుల ప్రమాణ స్వీకారమూ ఆలస్యమైంది.

మంగళవారం రోజు సుప్రీం కోర్టు తీర్పుతో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. తగినంత ఎమ్మెల్యేల బలం లేనందున సీఎం ఫడణవీస్​ రాజీనామా చేశారు. అనంతరం.. మహా వికాస్​ అఘాడీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ నెల 28న సీఎంగా ఠాక్రే ప్రమాణం చేయనున్నారు.

ABOUT THE AUTHOR

...view details