తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా' ప్రభుత్వ ఏర్పాటుపై భాజపా కోర్​ కమిటీ భేటీ - latest news on maharashtra govt formation

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటులో నెలకొన్న ప్రతిష్టంభన ఓ కొలిక్కి రానుంది. ప్రభుత్వ ఏర్పాటు చేయాలని భాజపాను ఆహ్వానించారు గవర్నర్​ భగత్​సింగ్​. ఈ నేపథ్యంలో బలనిరూపణకు అనుసంరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు భాజపా కోర్​ కమిటీ ఇవాళ భేటీ కానుంది.

'మహా' ప్రతిష్టంభన: నేడు భాజపా కోర్​ కమిటీ భేటీ

By

Published : Nov 10, 2019, 6:05 AM IST

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు చివరి అంకానికి చేరుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోషియారీ భాజపాను ఆహ్వానించారు. గవర్నర్​ నిర్ణయంతో.. భాజపా తదుపరి వ్యూహరచనపై దృష్టి సారించింది. ప్రభుత్వ ఏర్పాటు, బలనిరూపణకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు భాజపా కోర్‌ కమిటీ ఇవాళ భేటీ కానుంది. ప్రభుత్వ ఏర్పాటు సమయం, విశ్వాస పరీక్షకు అవసరమైన బలం సంపాదించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

సోమవారమే విశ్వాస పరీక్ష..

విశ్వాస పరీక్షకు గవర్నర్ విధించిన గడువు సోమవారమే కావడం వల్ల ఒక్క రోజు వ్యవధిలో బలనిరూపణ ఏ మార్గంలో పూర్తి చేయాలన్న అంశంపై ఇవాళ్టి కోర్‌కమిటీలో భాజపా వ్యూహరచన చేయనుంది.

బలనిరూపణపై ఉత్కంఠ..

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు... అక్టోబర్‌ 24న వెలువడగా.. మిత్రపక్షాలుగా పోటీ చేసిన భాజపా 105, శివసేన 56 సీట్లలో విజయం సాధించాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలం సంపాదించాయి. అయితే సీఎం పదవి సహా.. అధికారాన్ని సగం సగం పంచుకోవాలని శివసేన పట్టుబడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది. శివసేన తమ డిమాండ్ నుంచి వెనక్కి తగ్గకపోవడం వల్ల భాజపా రేపు బలనిరూపణ గండాన్ని ఎలా దాటుతుందనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

ఇదీ చూడండి:'అయోధ్య'పై సుప్రీం చారిత్రక తీర్పు.. శ్రీరామ పట్టాభిషేకం

ABOUT THE AUTHOR

...view details