తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఈనెల 30లోగా 'మహా' బలపరీక్ష.. విజయంపై భాజపా ధీమా - majority og maha

మహారాష్ట్ర శాసనసభలో బలనిరూపణకు నవంబర్ 30 వరకు గడువు విధించారు ఆ రాష్ట్ర గవర్నర్ భగత్​సింగ్ కోశ్యారీ. తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, మెజారిటీ నిరూపణ సాధ్యమేనని ధీమా వ్యక్తం చేసింది భాజపా. ఎన్​సీపీ ఎమ్మెల్యేల మద్దతుపై ఇప్పటికే గవర్నర్​కు ఆ పార్టీ శాసనసభా పక్షనేత అజిత్​ పవార్ లేఖ ఇచ్చారని వెల్లడించింది. అయితే తాజాగా ఎన్​సీపీ శాసనసభాపక్షనేతగా అజిత్ పవార్​ను పార్టీ తొలగించిన నేపథ్యంలో ఏం జరగనుందనే అంశమై ఉత్కంఠ నెలకొంది.

మెజారిటీ నిరూపణకు గడువు 30-గెలుపుపై కమలం ధీమా

By

Published : Nov 23, 2019, 12:41 PM IST

Updated : Nov 23, 2019, 3:01 PM IST

మహారాష్ట్ర శాసనసభలో మెజారిటీ నిరూపించుకునేందుకు భాజపా ప్రభుత్వానికి గవర్నర్ భగత్​సింగ్ కోశ్యారీ నవంబర్​ 30 వరకు గడువు విధించారు. ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకుంటుందని కాషాయదళం ధీమా వ్యక్తం చేసింది. తమకు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపింది. ఎన్​సీపీ ఎమ్మెల్యేల మద్దతిస్తున్నట్లు గవర్నర్‌కు అజిత్‌ పవార్‌ లేఖ ఇచ్చారని వెల్లడించింది. శాసనసభ్యుల సంతకాలతో అజిత్‌ లేఖ ఇచ్చినందున ఎన్సీపీ మద్దతు తమకే ఉందని భాజపా చెప్పుకొచ్చింది. అయితే అజిత్‌ పవార్‌కు మద్దతుగా ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టత లేదు. మహారాష్ట్రలో బలనిరూపణకు నవంబర్‌ 30వరకు గవర్నర్‌ గడువు ఇచ్చారు.

అజిత్‌ పవార్‌ ప్రభుత్వ ఏర్పాటులో భాగం కావడం.. అజిత్ నిర్ణయం పార్టీ నిర్ణయం కాదని శరద్‌ ప్రకటించడాన్ని బట్టి చూస్తే ఎన్సీపీలో చీలిక వచ్చినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే అజిత్‌ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకొని తన అనుకూల ఎమ్మెల్యేలతో ముందుకు సాగినట్లు తెలుస్తోంది. మరోవైపు శివసేనలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు చీలి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచే అవకాశం ఉన్నట్లు భాజపా వర్గాల్లో వినిపిస్తోంది. తాజా ఎన్నికల్లో భాజపా 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్‌ 44, చిన్న పార్టీలతో కలిపి ఇతరులు 29 స్థానాల్లో గెలుపొందారు. ఈ నేపథ్యంలో బలనిరూపణ సందర్భంగా వీరిలో ఎవరు ఎటువైపు మొగ్గుచూపుతారో తెలియాల్సి ఉంది.

తాజాగా అజిత్​పవార్​ను శాసనసభాపక్షనేతగా తొలగిస్తూ ఎన్​సీపీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మెజారిటీ నిరూపణ అంశమై ప్రస్తుతం సర్వత్రా చర్చ జరుగుతోంది.

ఇదీ చూడండి: సేనకు ఊహించని షాక్​- 'థ్రిల్లర్​'ను తలపించిన రాజకీయం

Last Updated : Nov 23, 2019, 3:01 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details