దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండగా ముందస్తు చర్యల్లో భాగంగా ప్రజలు మాస్కులు, శానిటైజర్లను విపరీతంగా వినియోగిస్తున్నారు. మహారాష్ట్రలోని ఔరంగబాద్‌లో కొందరు ఔషధ దుకాణాదారులు, పరిశ్రమల నిర్వాహకులు ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకొని గడువు ముగిసిన శానిటైజర్లను విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ సమాచారం అందుకున్న రాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన విభాగం(ఎఫ్‌డీఏ) అధికారులు దాడులు చేసి రూ. 50లక్షల విలువైన శానిటైజర్లు సీజ్ చేశారు.
పాత బాటిళ్లపై కొత్త లేబుళ్లు.. రూ.50 లక్షల శానిటైజర్లు సీజ్ - Corona effect on saniitisers
దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో శానిటైజర్లు, మాస్కులకు డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా భావించిన కొందరు ఔషధ దుకాణదారులు గడువు ముగిసిన శానిటైజర్ బాటిళ్లపై కొత్త లేబుళ్లు అతికించి ప్రజలను దోచుకుంటున్నారు.
పాత బాటిళ్లపై కొత్త లేబుళ్లు.. రూ.50 లక్షల ఔషధాలు సీజ్
ఔరంగబాద్ పరిసర ప్రాంతం వాలుజ్ పారిశ్రామిక వాడలోని యూరోలైప్ హెల్త్కోర్ సిబ్బంది గడువు ముగిసిన లేబుళ్లు తీసి, 2021తో గడువు ముగిసేలా తయారు చేసిన కొత్త లేబుళ్లను అతికిస్తున్నట్లు ఎఫ్‌డీఏ జాయింట్ కమిషనర్ సంజయ్ కాలే వెల్లడించారు. అందులో కాలపరిమితితో పాటు ధరలు కూడా మార్చినట్లు తెలిపారు.
ఇదీ చూడండి:'సందేహమే లేదు కరోనాపై పసికందులదే విజయం'