తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

మహారాష్ట్ర పుణెలోని ఓ రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని రసాయనాలు నింపిన డ్రమ్ములు భారీ శబ్దంతో పేలటం వల్ల భారీ ఎత్తున జ్వాలలు ఎగిసిపడ్డాయి. అయితే.. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Fire at chemical unit in Pune
రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

By

Published : Oct 1, 2020, 10:49 AM IST

మహారాష్ట్ర పుణెలోని ఓ రసాయన పరిశ్రమలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పరిశ్రమ మూసి ఉన్న సమయంలో ప్రమాదం జరగటం వల్ల ప్రాణ నష్టమేమీ లేదని అధికారులు తెలిపారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక విభాగం సంఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

పుణె-సోలాపూర్ రోడ్డులోని కుర్​కుంబ్ ప్రాంతంలో ఉన్న పరిశ్రమలో అర్ధరాత్రి 1.30గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. అగ్ని జ్వాలల ధాటికి రసాయనాలతో ఉన్న డ్రమ్ములు పేలాయని తెలిపారు. డ్రమ్ములు పేలటం వల్ల భారీగా జ్వాలలు ఎగిసిపడ్డాయని, మంటలు అదుపు చేసేందుకు కొన్ని గంటల పాటు శ్రమించాల్సి వచ్చినట్లు సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం కూలింగ్​ ప్రక్రియ కొనసాగుతోందన్నారు.

ఎగిసిపడుతున్న అగ్ని జ్వాలలు
రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం

ఇదీ చూడండి: పాక్ కాల్పుల్లో ఓ భారత జవాను మృతి

ABOUT THE AUTHOR

...view details