తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'లో 5 లక్షల మార్క్ దాటిన కరోనా కేసులు - corona in gujarat

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ రికార్డు స్థాయిలో 12,822 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 5 లక్షల మార్క్​ దాటింది. గుజరాత్​లో కేసులు 70వేలకు చేరువయ్యాయి. కర్ణాటకలో 7178 కొత్త కేసులు వెలుగుచూశాయి.

Maha COVID tally crosses 5 lakh
'మహా'లో 5 లక్షల మార్క్ దాటిన కరోనా కేసులు

By

Published : Aug 8, 2020, 8:56 PM IST

దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. కేసుల పరంగా తొలిస్థానంలో ఉన్న మహారాష్ట్రలో కొవిడ్​ ఉగ్రరూపం దాల్చుతోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఏకంగా 12,822 మంది వైరస్​ బారినపడ్డారు. ఇప్పటి వరకు ఒక్కరోజు కేసుల్లో ఇదే అత్యధికం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,03,084కు చేరింది.

ఇవాళ మరో 275 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా మరణాల సంఖ్య 17,367కు చేరింది. అయితే.. రికార్డు స్థాయిలో ఒక్కరోజే 11,082 మంది వైరస్​ నుంచి కోలుకోవటం కాస్త ఊరట కలిగిస్తోంది. మొత్తం 3,38,362 మంది వైరస్​ను జయించారు. ప్రస్తుతం 1,47,048 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

గుజరాత్​లో..

గుజరాత్​లో కరోనా కేసుల సంఖ్య 70 వేలకు చేరువైంది. ఇవాళ కొత్తగా 1,101 మందికి వైరస్​ నిర్ధరణ కాగా.. 23 మంది మరణించారు. మొత్తం మరణాలు 2,629కి చేరాయి. ఇవాళ ఒక్కరోజే 1,135 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 52,827 మంది కోలుకొని ఇళ్లకు చేరారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 9,56,645 నమూనాలను పరీక్షించారు.

అక్కడ 7వేలకుపైగా...

కర్ణాటకలో కరోనా వైరస్​ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇవాళ రికార్డు స్థాయిలో 7178 కొత్త కేసులు వెలుగుచూశాయి. ఇందులో 2665 కేసులు ఒక్క బెంగళూరులోనే నమోదయ్యాయి. 93 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 5006 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,72,102, మరణాలు 3091కి చేరాయి. ప్రస్తుతం 79,765 మంది చికిత్స పొందుతున్నారు.

ఇదీ చూడండి:దిల్లీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details