తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వెంటాడిన కరోనా భయాలు.. ఇద్దరు ఆత్మహత్య - మహారాష్ట్ర వార్తలు

మహారాష్ట్రలో కరోనా ధాటికి పరోక్షంగా ఇద్దరు వ్యక్తులు బలయ్యారు. కొవిడ్​ వైరస్​ సోకిందన్న అనుమానాలు, భయాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ వ్యక్తి గొంతుకోసుకొని చనిపోగా.. మరొకరు ఉరి వేసుకున్నారు.

Maha: COVID-19 patient from Assam allegedly commits suicide
వెంటాడిన కరోనా భయాలు.. ఇద్దరు ఆత్మహత్య

By

Published : Apr 11, 2020, 4:59 PM IST

కరోనా మహమ్మారి వల్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా లక్షకుపైగా మరణాలు సంభవించాయి. అయితే.. కరోనా భయాలతోనే ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడిన వేర్వేరు ఘటనలు మహారాష్ట్రలో జరిగాయి.

అసోం కార్మికుడు..

అసోం- నాగోన్​ నుంచి మహారాష్ట్రకు వచ్చిన ఓ వలస కార్మికుడికి ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో పాజిటివ్​ రావడం వల్ల అతడిని ఈ నెల 7న అకోలాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. తీవ్ర భయాందోళనలకు గురైన ఆ బాధితుడు అక్కడే గొంతుకోసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

నాసిక్​లో మరో వ్యక్తి

మహారాష్ట్ర- నాసిక్​లో మరో వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. చెహేది ప్రాంతానికి చెందిన ప్రతీక్​ రాజు అనే వ్యక్తి సూసైడ్​ నోట్​ రాసి మరీ.. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్లంబర్​గా పనిచేసే రాజు.. గొంతు వ్యాధితో ఓ ప్రైవేట్​ వైద్యుని వద్ద చికిత్స పొందుతున్నాడు. అయితే.. తనకు కరోనా సోకిందన్న అనుమానం, భయాల కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అతని రక్త నమూనాలను సేకరించి పరీక్షకు పంపించినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:కరోనాపై ఆందోళన వద్దు.. ఈ జాగ్రత్తలు పాటిస్తే చాలు!

ABOUT THE AUTHOR

...view details