తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కేరళలో నేటి కరోనా కేసులు '0'.. 'మహా'లో అత్యధికం - దేశంలో కరోనా కేసులు

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 678 మందికి వైరస్​ సోకింది. వీటితో కలిపి కొవిడ్​-19 మొత్తం కేసులు 13 వేలకు చేరువలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గుజరాత్​లో 374, పంజాబ్​లో 331, తమిళనాడులో 266 మందికి ఇవాళ కొత్తగా వైరస్​ సోకింది. కేరళలో మాత్రం నేడు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

Maha COVID-19 cases up by 678 to 12,974; death toll 548 so far
మహారాష్ట్రలో 13 వేలకు చేరువలో కరోనా కేసులు

By

Published : May 3, 2020, 10:09 PM IST

Updated : May 3, 2020, 10:34 PM IST

దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తోంది కరోనా. ఇప్పటివరకు 40,263మందికి వైరస్ సోకింది. 1,306మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా మహారాష్ట్రలో వైరస్ కేసులు నమోదయ్యాయి. తర్వాతి స్థానాల్లో గుజరాత్, దిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు ఉన్నాయి.

మహారాష్ట్రలో 13 వేలకు చేరువలో

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో 678 మందికి వైరస్​ సోకింది. రాష్ట్రంలో మొత్తం 12,974 మందికి వైరస్​ సోకినట్లు అధికారులు వెల్లడించారు. కొత్తగా మరో 27 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 548కి చేరింది.

గుజరాత్​లో మరో 374 కేసులు

గుజరాత్​లో కరోనా కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇవాళ మరో 37 మందికి వైరస్ పాజిటివ్​గా​ నిర్ధరణ అయింది. మొత్తం బాధితుల సంఖ్య 5,428కి చేరినట్లు అధికారులు తెలిపారు. తాజాగా 28 మంది మృతి చెందగా.. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 290 మంది వైరస్​కు బలయ్యారు. 896 మంది ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి అయ్యారు.

పంజాబ్​లో వెయ్యి దాటిన కేసులు

పంజాబ్​​లో నేడు రికార్డు స్థాయిలో మరో 331 వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా 1,102 మంది ప్రాణాంతక వైరస్​ బారిన పడినట్లు రాష్ట్ర అధికారులు ప్రకటించారు. కొత్తగా 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 117 మందికి వైరస్​ నయమైంది.

తమిళనాడులో 3 వేలు దాటిన బాధితులు

తమిళనాడులో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 266 మందికి వైరస్ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. వైరస్ బాధితుల సంఖ్య 3,023 కు చేరినట్లు ఆ రాష్ట్ర యంత్రాంగం వెల్లడించింది. మొత్తంగా 30 మంది మహమ్మారికి బలయ్యారు.

ఉత్తర్​ప్రదేశ్​లో 43 మంది మృతి..

ఉత్తరప్రదేశ్​లో ఇవాళ మరో 92 మంది మహమ్మారి బారినపడ్డారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 2,579 మందికి వైరస్​ సోకినట్లు ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. మొత్తంగా 698 మంది డిశ్ఛార్జి​ అయ్యారు. 43 మంది ప్రాణాలు కోల్పోయారు.

రాజస్థాన్​​లో మరో 31 కేసులు

రాజస్థాన్​లో కొత్తగా 31 వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం 2,803 మంది కరోనా​ బారినపడ్డారు. మరో ఇద్దరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 70కి పెరిగింది. 1121 మందిలో వైరస్ నయమైంది.

కర్ణాటకలో 25 మంది మృతి..

కర్ణాటకలో ఇవాళ మరో 5 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో మొత్తంగా 606 మందికి వైరస్​ సోకినట్లు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 25 మంది మృతి చెందగా, 282 మంది ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.

  • జమ్ముకశ్మీర్​లో మరో 35 మందికి వైరస్​ సోకగా మొత్తం 701 మంది బాధితులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. 287 మందికి వైరస్ నయమైంది. లద్దాఖ్​లో కొత్తగా 19 కేసులు నమోదయ్యాయి. దీంతో కేంద్ర పాలిత ప్రాంతంలో మొత్తం 41 మంది మహమ్మారి బారిన పడ్డారు.
  • కేరళలో ఇవాళ ఒక్కకేసు కూడా నమోదు కాలేదని అధికారులు వెల్లడించారు. మొత్తం 499 మందికి వైరస్ బారిన పడగా.. 401 మందికి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ అయ్యారు.
  • ఒడిశాలో తాజాగా 5 కేసులు నమోదు కాగా... రాష్ట్రంలో వైరస్​ బారిన పడిన వారి సంఖ్య 162కు చేరుకుంది.
  • ఉత్తరాఖండ్​లో ఇప్పటి వరకు 60 మంది వైరస్​ బారిన పడ్డారు. 39 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. ఒకరు మృతి చెందారు.
  • హరియాణాలో మొత్తం బాధితుల సంఖ్య 442కు చేరినట్లు అధికారులు తెలిపారు. అందులో 245 మంది రికవరీ అయ్యారు.
Last Updated : May 3, 2020, 10:34 PM IST

ABOUT THE AUTHOR

...view details