మహరాష్ట్రలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 2,361 కొత్త కేసులు నమోదయ్యాయి. 76 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 70,013, మృతుల సంఖ్య 2,362కు చేరింది.
24 గంటల్లో 779 మంది రోగులు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రులను నుంచి డిశ్చార్జి అయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు మొత్తం 30,108 మంది కోలుకున్నారని తెలిపింది. ప్రస్తుతానికి రాష్ట్రంలో 37,543 మంది చికిత్స పొందుతున్నారని, 4,71,473 నమూనాలను పరీక్షించినట్లు పేర్కొంది.