తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా' సీఎంకు ఎన్నికల ముందు చుక్కెదురు! - తీర్పు

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2014 ఎన్నికల ప్రమాణపత్రంలో 2 క్రిమినల్​ కేసులను వెల్లడించలేదని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు తీర్పును పక్కనబెట్టింది అత్యున్నత న్యాయస్థానం. 2 కేసుల్లో ముఖ్యమంత్రి విచారణ ఎదుర్కోవాల్సిందేనని స్పష్టంచేసింది.

'మహా' సీఎంకు ఎన్నికల ముందు చుక్కెదురు..!

By

Published : Oct 1, 2019, 12:38 PM IST

Updated : Oct 2, 2019, 5:51 PM IST

'మహా' సీఎంకు ఎన్నికల ముందు చుక్కెదురు!

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. 2014 ఎన్నికల సమయంలో సమర్పించిన ప్రమాణపత్రంలో తనపై పెండింగ్​లో ఉన్న 2 క్రిమినల్​ కేసులను వెల్లడించలేదని దాఖలైన పిటిషన్లపై విచారించింది సుప్రీం. ఈ అంశంలో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. తప్పుడు అఫిడవిట్​ దాఖలు చేశారన్న కేసు విచారణ కొనసాగించేందుకు అత్యున్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌-125 కింద కేసు విచారణ కొనసాగించొచ్చని స్పష్టం చేసింది.

మహారాష్ట్ర ఎన్నికల నగారా మోగిన తరుణంలో సుప్రీం కోర్టు తీర్పు ఫడణవీస్​కు కొంత ఇబ్బందికర అంశమే.

పిటిషన్ దాఖలు చేసిన సతీశ్​ అనే న్యాయవాది...

2014 ఎన్నికల సమయంలో తనపై ఉన్న క్రిమినల్‌ కేసుల వివరాలను అఫిడవిట్‌లో పేర్కొనలేదని ఫడణవీస్‌పై బాంబే హైకోర్టులో సతీశ్​ అనే న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. ఆయన ఎన్నిక చెల్లుబాటు కాదని ఆదేశాలు జారీ చేయాలని వ్యాజ్యంలో పేర్కొన్నారు. అయితే హైకోర్టు సతీశ్​ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం వివరణ కోరుతూ గతంలో ఫడణవీస్‌కు నోటీసులు జారీ చేసింది.

సీఎం రాజీనామా చేయాలి: ఎన్​సీపీ

ఫడణవీస్​ అంశంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించింది ఎన్​సీపీ. ముఖ్యమంత్రికి క్లీన్​చిట్​ ఇచ్చిన బాంబే హైకోర్టు తీర్పును ... అత్యున్నత న్యాయస్థానం పక్కనబెట్టిన నేపథ్యంలో ఫడణవీస్​ రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి నవాబ్​ మాలిక్​. సీఎం రాజకీయాలను త్యజించాలని.. ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసే హక్కులేదని అన్నారు.

ఇదీ చూడండి:వాషింగ్టన్​ వేదికగా అమెరికాకు జైశంకర్​ కౌంటర్

Last Updated : Oct 2, 2019, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details