తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు

మహారాష్ట్రలో వర్ష బీభత్సం మళ్లీ మొదలైంది. భారీ వర్షాల కారణంగా నాసిక్ సహా పలు జిల్లాలను వరదలు ముంచెత్తాయి. పలు చోట్ల కొండచరియలు విరిగిపడి రవాణావ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

'మహా'లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు

By

Published : Jul 11, 2019, 1:21 PM IST

Updated : Jul 11, 2019, 2:28 PM IST

'మహా'లో బీభత్సం సృష్టిస్తున్న వరదలు

మహారాష్ట్రను మళ్లీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వానల కారణంగా నాసిక్ జిల్లాలోని త్రయంబకేశ్వరాలయం సమీపంలో వరద నీరు రోడ్లపై ప్రవహిస్తూ నదిని తలపిస్తోంది. రోడ్ల పక్కన నిలిపిన వాహనాలూ వరదల్లో కొట్టుకుపోయాయి.

తొరంగాణ ఘాట్​లో మోఖాడా, త్రయంబకేశ్వర్​ రహదారిపై భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. మోఖా​డా-నాసిక్​ల మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

పాల్​ఘర్​ జిల్లాలో వరదలకు ఓ పై వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని జిల్లా అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: కాలువలో పడిన చిన్నారి.. దొరకని ఆచూకీ

Last Updated : Jul 11, 2019, 2:28 PM IST

ABOUT THE AUTHOR

...view details