తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శుభవార్త అంటున్న భాజపా- వెనక్కి తగ్గని సేన - మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు తాజా వార్తలు

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రతిష్టంభనకు ఇంకా తెరపడలేదు. అయితే త్వరలోనే ప్రభుత్వ ఏర్పాటుపై శుభవార్త వింటారని కమలనాథులు అంటున్నారు. మరోవైపు శివసేన మాత్రం చెరిసగం పాలనపై రాతపూర్వక హామీ కావాలని డిమాండ్​ చేస్తోంది.

శుభవార్త అంటున్న భాజపా- వెనక్కి తగ్గని సేన

By

Published : Nov 5, 2019, 7:59 PM IST

భాజపా-శివసేన.. మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందే పొత్తుతో బరిలోకి దిగాయి. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీని సాధించాయి. హంగ్​ ఏర్పడిన హరియాణాలో సర్కారు కొలువుదీరినా.. స్పష్టమైన మెజారిటీ వచ్చిన మహారాష్ట్రలో మాత్రం ప్రభుత్వ ఏర్పాటుపై ఎలాంటి పురోగతి లేదు.

10 రోజులు గడిచిపోయాయి.. ఈ నెల 9వ తేదీతో ప్రస్తుత శాసనసభ గడువూ పూర్తవనుంది. ఈ తరుణంలో ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భాజపా తీవ్రంగా శ్రమిస్తోంది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​.. పార్టీ కీలక నేతలతో నేడు భేటీ అయ్యారు. సమావేశం అనంతరం విలేకర్లతో మాట్లాడిన సీనియర్​ నేతలు​.. ప్రభుత్వ ఏర్పాటుపై త్వరలోనే శుభవార్త వింటారని ప్రకటించారు.

"ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఏ క్షణంలోనైనా శుభవార్త వింటారు. భాజపా శాసనసభాపక్ష నేత ఫడణవీస్​కు మా పూర్తి మద్దతును తెలిపాం. భాజపా-శివసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. శివసేన ఇప్పటివరకు మాకు ఎలాంటి ప్రతిపాదన చేయలేదు. వారి కోసం భాజపా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఫడణవీస్​ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు." - భాజపా నేతలు

వెనక్కి తగ్గని సేన...

ఫలితాలు వెలువడిన నాటి నుంచి సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న శివసేన ఎంపీ సంజయ్​ రౌత్​ మరోసారి కీలక వాఖ్యలు చేశారు. భాజపా నేతల ప్రకటనలపై స్పందించారు.

"భాజపా నేతలు ఏం చెప్పారో నేను వినలేదు. వారు ముఖ్యమంత్రి పీఠం పంచుకోవడంపై ఏమైనా మాట్లాడి ఉంటే నిజంగా వారు అర్థం చేసుకున్నట్లే. అయితే ఆ విషయంపై భాజపా నుంచి మాకు రాతపూర్వకమైన హామీ కావాలి." - సంజయ్​ రౌత్​, శివసేన ఎంపీ

భాజపాకు రాంరాం చెప్తేనే...

భాజపా-శివసేన వివాదంపై శరద్​ పవార్​ నేతృత్వంలోని ఎన్​సీపీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి నవాబ్​ మాలిక్​ మాట్లాడుతూ... భాజపా-సేన మధ్య సయోధ్య కుదరకపోతే ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తామని తెలిపింది.

"శివసేనకు భాజపా ముఖ్యమంత్రి పీఠం ఇస్తే ఏ సమస్యా లేదు. భాజపా తిరస్కరిస్తే... ప్రత్యామ్నాయం ఉంది. అయితే అందుకోసం శివసేన ఓ ప్రకటన చేయాలి. భాజపాతో తమకు ఇంకా ఎలాంటి సంబంధాలు లేవని చెప్తే...అప్పుడు ప్రత్యామ్నాయం ఉంటుంది." - నవాబ్​ మాలిక్​, ఎన్​సీపీ అధికార ప్రతినిధి

గడ్కరీకి 2 గంటలు చాలు...

శివనేన సీనియర్​ నేత కిషోర్ తివారీ.. ఆర్​ఎస్​ఎస్​ అధినేత మోహన్​ భగవత్​కు ఓ లేఖ రాశారు. భాజపా-శివసేన మధ్య పరిస్థితి సద్దుమణగాలంటే గడ్కరీని చర్చలకు పంపాలని కోరారు. గడ్కరీ అయితే ఈ సమస్యకు రెండు గంటల్లోనే పరిష్కారం చెబుతారని అభిప్రాయపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details