మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ... ఎమ్మెల్యేలు ఈ నెల 30న సమావేశం కానున్నారు. విధాన్ భవన్లో జరిగే ఈ భేటీలో భాజపా సభాపక్ష నేతను ఎన్నుకోనున్నట్లు పార్టీ రాష్ట్ర బాధ్యులు చంద్రకాంత్ పాటిల్ తెలిపారు.
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో.. ఇతర పార్టీలకు చెందిన 15 మంది ఎమ్మెల్యేలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వీరితో పాటు స్వతంత్రులు, చిన్న పార్టీలు మద్దతు పలకనున్నట్లు తెలుస్తోంది.