మహారాష్ట్ర భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌కు కొవిడ్ సోకింది. ఇటీవల తనను కలిసిన నేతలు, కార్యకర్తలు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన ట్విట్టర్ ద్వారా సూచించారు. మహమ్మారి విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాలని కోరారు.
లాక్డౌన్ నుంచి అవిశ్రాంతంగా పని చేస్తున్నాను. దేవుడు నాకు కొంచెం విశ్రాంతి ఇవ్వాలి అని భావించినట్లున్నాడు. కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. స్వీయ నిర్భందంలో ఉన్నాను. వైద్యుల సూచనలను పాటిస్తూ చికిత్సకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను.