తెలంగాణ

telangana

ETV Bharat / bharat

70% కరోనా మరణాలు ఆ ఐదు రాష్ట్రాల్లోనే - కరోనా వైరస్​ కేసులు

దేశవ్యాప్తంగా కరోనా మరణాల్లో 70శాతం.. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్​, కర్ణాటక, దిల్లీ, తమిళనాడులోనే నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం ఉన్న 62శాతం యాక్టివ్​ కేసులు.. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్​, కర్ణాటక, ఉత్తర్​ప్రదేశ్​, తమిళనాడులోనే ఉన్నట్టు స్పష్టం చేసింది.

Maha, AP, Karnataka, Delhi and TN account for 70 pc of total COVID-19 deaths: Health Ministry
70శాతం కరోనా మరణాలు ఆ ఐదు రాష్ట్రాల్లోనే

By

Published : Sep 3, 2020, 7:44 PM IST

దేశంలో 70శాతం కరోనా మరణాలు.. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్​, కర్ణాటక, దిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లోనే నమోదవుతున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 62శాతం యాక్టివ్​ కేసులు.. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్​, కర్ణాటక, ఉత్తర్​ప్రదేశ్​, తమిళనాడులోనే ఉన్నట్టు వివరించింది.

"ఈ ఐదు రాష్ట్రాల్లోని మరణాలను అనేక వారాలుగా పరిశీలిస్తుంటే.. కేవలం కర్ణాటక, దిల్లీలోనే సీఎఫ్​టీ(కేస్​ ఫటాలిటీ ట్రాజెక్టరీ) పెరిగినట్టు కనపడుతోంది. అయితే ఆంధ్రప్రదేశ్​, మహారాష్ట్ర, తమిళనాడులో రోజువారీ మరణాలు తగ్గుతున్నాయి. ఒక వారం నుంచి మరో వారానికి పోల్చుకుంటే.. ఆంధ్రప్రదేశ్​లో మరణాలు 4.5శాతం తగ్గాయి. మహారాష్ట్రలో అది 11.5శాతం, తమిళనాడులో 18.2శాతం తగ్గింది. అయితే రోజువారీ మరణాల సగటు దిల్లీలో 50శాతం, కర్ణాటకలో 9.6శాతం పెరిగింది."

--- రాజేశ్​ భూషణ్​, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి.

అన్నిట్లోనూ తక్కువే...

ప్రపంచ దేశాల్లో (ప్రతి పదిలక్షల జనాభాకు) భారత్​లోనే తక్కువ కేసులున్నాయని(2,792) భూషణ్​ వెల్లడించారు. ఆ లెక్కనే మరణాలు(49) కూడా తక్కువని పేర్కొన్నారు. రికవరీ కేసులు.. యాక్టివ్​ కేసుల కన్నా 3.6రేట్లు ఎక్కువని వివరించారు.

ఆరోగ్య సిబ్బందికి...

ఆరోగ్య సిబ్బంది కరోనా బారిన పడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ(18శాతం) మొదటి స్థానంలో ఉందని ఆరోగ్య కార్యదర్శి పేర్కొన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర(16శాతం), దిల్లీ(14శాతం), కర్ణాటక(13శాతం), పుదుచ్చేరి(12శాతం), పంజాబ్​(11శాతం) ఉన్నాయని వెల్లడించారు.

దేశవ్యాప్తంగా బుధవారం నాటికి 38,53,406 కేసులు వెలుగుచూశాయి. 67,376మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి:-రోజువారీ కేసుల్లో ఆ దేశాలను దాటేసిన భారత్​

ABOUT THE AUTHOR

...view details