తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అక్టోబర్​ 19 నుంచి ముంబయిలో మెట్రో పరుగులు

ముంబయిలో మెట్రో సేవల పునః ప్రారంభంపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి మెట్రో రైళ్లు నడిపేందుకు అనుమతులిచ్చింది. అయితే పునరుద్ధరణ పనుల వల్ల ఈ నెల 19 నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

Maha allows metro trains to run from Oct 15, reopens libraries
గురువారం నుంచి ముంబయిలో మెట్రో కూత

By

Published : Oct 14, 2020, 6:09 PM IST

Updated : Oct 14, 2020, 7:55 PM IST

కరోనా ధాటికి రాష్ట్రంలో నిలిచిపోయిన మెట్రో కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'బిగిన్​ అగైన్​' మిషన్​లో భాగంగా.. గురువారం నుంచి ఈ ప్రయాణాలకు అనుమతులిచ్చింది. దశలవారీగా మెట్రో సేవలు పునరుద్ధరించాలని స్పష్టం చేసింది.

మహారాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన కొద్దిసేపటికి ఎమ్​ఎమ్​ఓపీఎల్​(ముంబయి మెట్రో వన్​ ప్రైవేట్​ లిమిటెడ్​) ఓ ప్రకటన విడుదల చేసింది. మెట్రో రైళ్ల పునరుద్ధరణ వల్ల ఈ నెల 19 నుంచి ప్రజలకు సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.

మరిన్ని...

కరోనా నిబంధనలను పాటిస్తూ.. ప్రభుత్వ-ప్రైవేటు నేతృత్వంలోని గ్రంథాలయాలు తెరుచుకోవచ్చని మార్గదర్శకాలు విడుదల చేసింది మహా సర్కార్​. కంటైన్​మెంట్​ జోన్ల వెలుపల వ్యాపారాలకు సంబంధించిన ఎగ్జిబిషన్లకు కూడా అనుమతులిచ్చింది.

స్థానిక వారాంతపు సంతలు తెరుచుకునేందుకు అవకాశమిచ్చింది ప్రభుత్వం. వినియోగదారుల రద్దీని నియంత్రించేందుకు గురువారం నుంచి అదనంగా రెండు గంటల పాటు(రాత్రి 9గంటల వరకు) షాపులు తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది.

విద్యాసంస్థలు మాత్రం ఈ నెల 31వరకు మూతపడే ఉంటాయని స్పష్టం చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం.

ఇదీ చూడండి:-ఆలయాలపై సీఎం, గవర్నర్​ మాటల యుద్ధం

Last Updated : Oct 14, 2020, 7:55 PM IST

ABOUT THE AUTHOR

...view details