మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలోని ఇంద్రావతి నదిలో 15 మంది ప్రయాణికులతో వెళ్తున్న రెండు పడవలు బోల్తా పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు గల్లంతు అయ్యారు.
ఇంద్రావతి నదిలో పడవలు బోల్తా.. ఇద్దరు గల్లంతు - Boat accident Maharashtra
మహారాష్ట్ర ఇంద్రావతి నదిలో రెండు పడవలు మునిగిపోయాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు గల్లంతయ్యారు. 13 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి.
మహాలో రెండు పడవలు బోల్తా.. ఇద్దరు గల్లంతు
సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి స్థానికుల సహకారంతో 13 మందిని రక్షించాయి. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపట్టాయి. మరోవైపు సురక్షితంగా బయటపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి:మహారాష్ట్రలో లోయలో పడ్డ బస్సు- ఐదుగురు మృతి