తండ్రిని కోల్పోయి, తీవ్ర కష్టాల్లో ఉన్న ఓ ఎస్సీ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కొందరు కామాంధులు. ఏకంగా 10 మంది ఆరు నెలల పాటు ఆమెను లైంగికంగా తీవ్రంగా వేధించారు. మహారాష్ట్ర సోలాపుర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆరు నెలలుగా
సోలాపూర్ జిల్లాలోని ఓ గుడి వద్ద 16ఏళ్ల బాలిక ఏడుస్తూ కనిపించగా... స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ బాలికను విచారించిన పోలీసులు విస్తుపోయారు. గత 6 నెలలుగా 10 మంది బలవంతంగా వేర్వేరు చోట్లకు తీసుకువెళ్లి తనపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా తెలిపింది ఆ బాలిక. వారిలో కొంతమంది తన స్నేహితులని వెల్లడించింది.