మహారాష్ట్ర బావ్ధన్ ప్రాంతంలో కరోనా బాధితులతో వెళ్తోన్న ఓ అంబులెన్స్ బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మంది కొవిడ్ రోగులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
కరోనా రోగుల అంబులెన్స్ బోల్తా.. 12 మందికి గాయాలు
మహారాష్ట్రలో కరోనా రోగులను తరలిస్తోన్న ఓ అంబులెన్స్ బోల్తా పడింది. ఈ ఘటనలో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
కరోనా రోగుల అంబులెన్స్ బోల్తా
" కొత్రుడ్ నుంచి బెలవాడి ప్రాంతంలోని కొవిడ్-19 ఐసోలేషన్ కేంద్రానికి 12 మంది కరోనా రోగులను తరలిస్తున్న క్రమంలో పుణె-ముంబయి మార్గంలో బావ్ధన్ సమీపంలో అంబులెన్స్ బోల్తా కొట్టింది."
- యశ్వంత్ గవారి, సీనియర్ ఇన్స్పెక్టర్, హింజవాడి పోలీస్ స్టేషన్