తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా' విధ్వంసం: 7 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా విలయం కొనసాగుతోంది. నానాటికీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దేశంలోనే కరోనా ప్రభావం అధికంగా మహారాష్ట్రలో కేసుల సంఖ్య 7 లక్షలు దాటింది. దిల్లీ, తమిళనాడు, కేరళ, గుజరాత్​లోనూ వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది.

CORONA STATES
కరోనా కేసులు

By

Published : Aug 25, 2020, 9:35 PM IST

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తోంది. పలు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో కొత్తగా 10వేలకుపైగా కేసులు రాగా.. మొత్తం సంఖ్య 7 లక్షలు దాటింది.

రాష్ట్రంలో కరోనా బారిన పడి మరో 329 మంది చనిపోగా.. ఇప్పటివరకు మొత్తం సంఖ్య 22,794కు పెరిగింది.

దేశ రాజధానిలో..

దిల్లీలో కొత్తగా 1,544 మందికి వైరస్ సోకింది. ఇప్పటివరకు 1,64,071 మంది కరోనా బారిన పడ్డారు. వైరస్ ధాటికి 4,330 మంది చనిపోగా.. రాజధానిలో 11,998 క్రియాశీల కేసులు ఉన్నాయి.

  • తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య 4 లక్షలకు చేరువైంది. కొత్తగా 5,951 మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,721 మంది మృతిచెందారు.
  • కేరళలో మళ్లీ వైరస్ ఉద్ధృతి పెరుగుతోంది. కొత్తగా 2,375 మందికి వైరస్ సోకగా.. కేసుల సంఖ్య 60 వేలు దాటింది. మృతుల సంఖ్య 244కు చేరింది.
  • కర్ణాటకలో ఒక్కరోజులో 8 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 3 లక్షలకు చేరువలో ఉంది. వైరస్ ధాటికి ఇప్పటివరకు రాష్ట్రంలో 4,958 మంది మృత్యువాత పడ్డారు.

ఇదీ చూడండి:బంగాల్ బరి: 'మోదీ' అస్త్రంతోనే దీదీపై గురి!

ABOUT THE AUTHOR

...view details