మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కి చెందిన వ్యక్తి ఐదు రోజుల్లో రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఈ నెల 2న ఖండ్వాలో ఒక మహిళతో వివాహం జరిగింది. తరువాతి ఐదు రోజులకే అనగా డిసెంబర్ 7వ తేదీన మోవ్ పట్టణానికి చెందిన మరో మహిళను వివాహం చేసుకున్నాడని ఆరోపిస్తూ మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది
బయటపడిందిలా...
డిసెంబర్ 7వ తేదీన మోవ్‌లో నిందితుని వివాహ వేడుకకు హాజరైన మొదట పెళ్లితరపు వారు ఒకరు ఫోటోలు తీసి బంధువులకు పంపడంతో వారు అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది తెలుసుకున్న రెండో వధువు కుటుంబ సభ్యులు సైతం నిందితునిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆశ్రయించారు.