మధ్యప్రదేశ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.
భోపాల్‌లోని 'బడా తలాబ్' సరస్సు నిండుకుండలా మారి నగరంలోని చిరయు ఆసుపత్రిలోకి నీరు చేరింది. ఆసుపత్రి వార్డుల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.
సెహోర్ జిల్లాలోని అస్తా నగరంలో వరదల కారణంగా ఓ భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.