తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్లు .. మధురై మహిళల ఘనత - ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్లు .. మధురై మహిళల కృషి

రోజురోజుకూ పెరిగిపోతున్న ప్లాస్టిక్ వ్యర్థాల సమస్యకు తమిళనాడు మధురైకి చెందిన మహిళలు చక్కని పరిష్కారం చూపిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, రీసైక్లింగ్ చేసి రోడ్లు నిర్మాణానికి ముడిసరుకును తయారుచేస్తున్నారు. ఆర్థికంగానూ స్వావలంబన సాధిస్తున్నారు.

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్లు .. మధురై మహిళల కృషి

By

Published : Nov 19, 2019, 4:03 PM IST

ప్లాస్టిక్‌ వ్యర్థాలతో రోడ్లు .. మధురై మహిళల కృషి

ప్రపంచవ్యాప్తంగా నియంత్రించడానికి సాధ్యం కాని సమస్య ఏదైనా ఉంటే అది ప్లాస్టికే. ప్రభుత్వాలు ఎన్ని సంస్కరణలు తెచ్చినా.... నియంత్రణకు ఎంతలా పాటుపడుతున్నా ఏదో ఓ మూల ప్లాస్టిక్‌ వల్ల హాని జరుగుతూనే ఉంది. ఈ హానిని కొంత మేర ఎదుర్కొనేందుకు.. తమిళనాడులోని మధురైకి చెందిన మహిళా బృందం కృషి చేస్తోంది. వృథాగా ఉండే ప్లాస్టిక్‌ వస్తువులను తమకు అప్పగిస్తే వాటిని ఉపయోగించి రోడ్లను నిర్మించేందుకు ముడి సరుకు అప్పగిస్తామంటోంది.

రోడ్డు నిర్మాణం..

మధురైకి చెందిన ఓ మహిళా స్వయం సమృద్ధి బృందం ప్లాస్టిక్‌ రోడ్ల నిర్మాణం కోసం వస్తువులను అందిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రతి ఇంటి నుంచి ప్లాస్టిక్‌ను సేకరించి వాటిని యంత్రాల సాయంతో ముక్కలుగా చేస్తున్నారు. అనంతరం వాటిని కిలోల లెక్కన ప్యాక్‌ చేసి ప్లాస్టిక్‌ రోడ్లు నిర్మించేందుకు అందిస్తున్నారు. ఒక కిలోమీటర్‌ రో‌డ్డును నిర్మించేందుకు వెయ్యి కిలోల ప్లాస్టిక్‌ అవసరం. ప్రస్తుతం వీరి బృందం రోజుకు 250 కిలోల ప్లాస్టిక్‌ను ముక్కలుగా చేసి ప్లాస్టిక్‌ రోడ్డుకు ముడిసరుకుగా తయారు చేస్తోంది.

అవగాహన కల్పిస్తూ..

2012 నుంచి ఈ బృందం ప్లాస్టిక్‌ వ్యర్థాలను రీసైకిల్‌ చేస్తోంది. ప్రస్తుతం వారి సంస్థలో 8 మంది ఉద్యోగులున్నారు. రోజుకు మనిషికి 100 రూపాయల చొప్పున సంపాదిస్తున్నారు. రెండేళ్ల కిందట తమిళనాడు ప్రభుత్వం సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించింది. కానీ ఈ మహిళా బృందం.. 8 ఏళ్ల నుంచి దీని వల్ల ఉండే నష్టాలపై ప్రజల్లో అవగాహనకు ప్రయత్నిస్తోంది. అయితే తాము మార్కెటింగ్‌ సమస్య ఎదుర్కొంటున్నామని.. ప్రభుత్వం తమకు సాయం అందించాలని వారు కోరుకుంటున్నారు.

ఇదీ చూడండి: మరో 'పుల్వామా' దాడికి కుట్ర- భగ్నం చేసిన భద్రతా దళం

ABOUT THE AUTHOR

...view details