తమిళనాడు మధురైకి చెందిన 13 ఏళ్ల నేత్రకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ ఫర్ డెవలప్మెంట్ అండ్ పీస్ (యూఎన్ఏడీఏపీ)కి 'గుడ్విల్ అంబాసిడర్ ఫర్ పూర్' గా ఎంపికైంది.
నేత్ర తండ్రి మోహన్.. మధురైలోని ఓ క్షౌరశాల యజమాని. ఆమె చదువు కోసం రూ.5 లక్షలు జమ చేశాడు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారికి ఈ డబ్బును విరాళంగా ఇచ్చేలా తన తండ్రిని నేత్ర ఒప్పించింది.
నేత్ర చూపిన చొరవను మంత్రి సెళ్లూరు రాజు మెచ్చుకున్నారు. ఆమెకు జయలలిత పురస్కారం అందించాలని ముఖ్యమంత్రి కె.పళనిస్వామికి సిఫార్సు చేస్తానని వెల్లడించారు.
"కొన్ని రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోదీ నేత్రను మెచ్చుకున్నారు. మధురైకి ఆమె గర్వకారణం. ఐరాస నేతలతో కలిసే అవకాశం రావటం సంతోషంగా ఉంది. పేద ప్రజల ఆర్థిక పరిస్థితికి సంబంధించిన కార్యక్రమానికి హాజరుకాబోతున్నా. నేత్రకు జయలలిత పురస్కారాన్ని ప్రకటించాలని ముఖ్యమంత్రికి సిఫార్సు చేస్తా."