తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిత్యానంద 'కైలాస' దీవిలో హోటల్​ ప్రారంభిస్తాడట! - నిత్యానంద స్వామిజీ

భారత్​ వదిలి పారిపోయిన వివాదాస్పద స్వామిజీ నిత్యానంద ఏర్పాటు చేసిన దేశంలో హోటల్​ ప్రారంభించేందుకు ఓ వ్యక్తి ముందుకొచ్చాడు. తమిళనాడు మధురైకి చెందిన వ్యాపారవేత్త కుమార్​.. కైలాసకు వచ్చే భక్తుల కోసం వెరైటీ వంటలను సిద్ధం చేస్తానని అంటున్నాడు. ఈ మేరకు అనుమతి కోసం నిత్యానందకు లేఖ రాశాడు.

Kailasa
కైలాస

By

Published : Aug 23, 2020, 7:42 AM IST

వివాదాస్పద స్వామిజీ నిత్యానంద 'కైలాస' అనే ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా ప్రత్యేక కరెన్సీతోపాటు 'రిజర్వు బ్యాంక్ ఆఫ్ కైలాస' ప్రకటించుకున్నారు. అయితే తమిళనాడు మధురైకి చెందిన ఓ వ్యాపారవేత్త.. కైలాసలో హోటల్​ ప్రారంభించాలని భావిస్తున్నట్లు చెప్పాడు.

కుమార్

మధురైలోని 'సిటీ డ్రీమ్జ్ ఇన్'​ యజమాని కుమార్. ​కైలాసలో హోటల్ ప్రారంభించేందుకు అనుమతి కోరుతూ లేఖ రాశాడు.

కుమార్ లేఖ

"కొత్తగా ఏర్పాటైన దేశంలో హోటల్ ప్రారంభించాలనుకుంటున్నా. మాస్క్ పరోటా సహా వివిధ రకాల వంటలను అందించి.. దేశాన్ని అభివృద్ధి చేసేందుకు నిత్యానందకు సాయం చేస్తా. అక్కడికి వచ్చే భక్తులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తా."

- కుమార్

వివిధ ఆరోపణల మీద 50 సార్లు కోర్టుకు హాజరైన నిత్యానంద.. గతేడాది నవంబరులో భారత్‌ వదలి పారిపోయారు. అయితే, ఆయన ఎక్కడ ఉంటున్నారనే విషయం మాత్రం తెలియదు. ఈక్వెడార్‌కు సమీపంలోని ఓ ద్వీపంలో ఆయన నివాసం ఉంటున్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అయితే, ఈక్వెడార్‌ మాత్రం ఈ వార్తలను ఖండిస్తోంది.

ఇదీ చూడండి:నిత్యానంద 'రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్ కైలాస'

ABOUT THE AUTHOR

...view details