దొంగతనం అంటే ఏంటో కూడా తెలియని వయసు 13 ఏళ్లంటే. కానీ ఆ వయసులోనే తమిళనాడులోని ఓ బాలుడిపై దొంగ అనే ముద్ర పడింది. ఏదో చిల్లర దొంగతనం కాదది. అక్షరాలా లక్ష రూపాయలు. అదీ ఓ శుభకార్యం జరుగుతుండగా. ఎవరూ లేని సమయంలో విడిది గదిలో చొరబడి, ఆతిథ్యం ఇచ్చిన వారికే శఠగోపం పెట్టేంత పనిచేశాడు. చివరకు పోలీసులకు చిక్కాడు.
వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు మధురైలోని పప్పకుడి గ్రామంలోని కలవసల్ మ్యారేజ్ హాల్లో ఈనెల 18న రాజ్‌కుమార్ అనే వ్యక్తి ఓ శుభకార్యం నిర్వహించాడు.
కార్యం జరుగుతుండగా అక్కడి విడిది గదిలో ఓ లక్ష రూపాయలు మాయమయ్యాయి. గుర్తించిన రాజ్‌కుమార్ ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.