తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మద్యం షాపులు మూసేయాలని హైకోర్టు ఆదేశం - మందుబాబులకు ఝలక్.. షాపుల మూసివేతకు హైకోర్టు ఆదేశం

మద్యం దుకాణాలు మూసేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది ఆ రాష్ట్ర హైకోర్టు. ఆన్​లైన్​లో మాత్రమే అమ్మకానికి అనుమతించింది.

liquor
మందుబాబులకు హైకోర్టు ఝలక్

By

Published : May 8, 2020, 7:52 PM IST

తమిళనాడులో మద్యం కొనుగోళ్లకు పెద్ద ఎత్తున మందుబాబులు క్యూ కడుతున్న నేపథ్యంలో లిక్కర్​ దుకాణాలు మూసివేయాలని ఆదేశించింది ఆ రాష్ట్ర హైకోర్టు. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ మద్యం షాపులను ప్రజా ప్రయోజనం దృష్ట్యా మూసివేయాలని పేర్కొంది.

ఆన్​లైన్​కు అవకాశం..

అయితే ఆన్​లైన్​లో అమ్మకాలు జరపవచ్చని వెసులుబాటు కల్పించింది కోర్టు. ముందుగా బుక్ చేసుకుని ఇంటికి తెప్పించుకునే విధంగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది.

ఇదీ చూడండి:'మహా' రైలు ప్రమాదంపై ఎన్​హెచ్​ఆర్​సీ నోటీసులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details