ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్‌కు మద్రాసు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. గాడ్సేపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో కమల్ తీరును తప్పుపడుతూ ఈ నిర్ణయం తీసుకుంది. రూ.10వేలు చొప్పున రెండు పూచీకత్తులతో అరవకురిచి జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుకావాలని మద్రాసు హైకోర్టు అదేశించింది.
ద్వేషాన్ని వ్యాప్తి చేసే ప్రసంగాలు సాధారణమయ్యాయని జస్టిస్ ఆర్ పుగలెంధి నేతృత్వంలోని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. 'నిప్పుతో దీపాన్ని వెలిగించవచ్చు, అలాగే అడవినీ నాశనం చేయవచ్చు' అని వ్యాఖ్యానించింది.
"తీవ్రవాదులు, అతివాదులను మతం, జాతి, ప్రాంతం, పుట్టుక ఆధారంగా నిర్ణయించడం సరికాదు, వారి ప్రవర్తనతోనే నేరస్థులుగా మారుతారు" అని ధర్మాసనం పేర్కొంది.